పైసల కక్కుర్తితో సీఎం జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనంపై ట్విట్టర్లో స్పందించారు. 108,104 కి ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతోనే... తన భర్త మరణించారని అనంతపురం జిల్లా ఉరవకొండకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసిందని లోకేష్ విమర్శించారు. 108 స్కామ్ లో జగన్ కొట్టేసిన రూ.307 కోట్లతో... ఆ వ్యక్తి ప్రాణాలు వెనక్కి తీసుకురాగలరా అని నిలదీశారు. మానవత్వంతో వ్యవహరించి మహిళకు సహాయం చేసిన స్థానిక ఎస్సై ధరణి బాబుని లోకేష్ అభినందించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన నారా లోకేష్... - లోకేష్ వార్తలు
ఈటీవీ భారత్లో ప్రచురితమైన కథనానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 108, 104కి ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతోనే... తన భర్త మరణించారని అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనపై ఈటీవీ భారత్లో కథనం ప్రచురితం అయ్యింది. దీనిపై లోకేష్ స్పందించారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందించి నారా లోకేష్ ట్వీట్
Last Updated : Jul 17, 2020, 9:55 AM IST