ఇటీవల విషజ్వరాలతో సంభవించిన మరణాల గురించి ఈటీవీ భారత్, ఈటీవీలో ప్రసారమైన కథనాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్టర్లో స్పందించారు. కర్నూలులో ఇద్దరు చిన్నారులు, చిత్తూరులో పెళ్లి కూతురు డెంగీ జ్వరంతో మృతి చెందటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెందరు బలి అవ్వాలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఈటీవీ భారత్ విషజ్వరాల కథనాలపై లోకేశ్ స్పందన - tdp leader nara lokesh latest news
ఇటీవల విషజ్వరాలతో మృతి చెందినవారిపై ఈటీవీ భారత్, ఈటీవీ ప్రసారం చేసిన కథనాలపై నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలి కావాలంటూ ఆయన ప్రశ్నించారు.
విషజ్వరాలపై ఈటీవీభారత్ కథనాలకు లోకేశ్ స్పందన