Lokesh on HC Verdict: వైకాపా సర్కారు విద్వేషపు ఆలోచనలతో తలపెట్టిన మూడు ముక్కలాటకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు భూములు త్యాగం చేశారని గుర్తుచేశారు. వారందరి విజయమే ఈ తీర్పని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ ముద్దు.. రాజధాని వికేంద్రీకరణ వద్దు.. అనే నినాదంతో అమరావతి ప్రాంత ప్రజలు సాగించిన నిస్వార్థ ఉద్యమానికి ఇది ఫలితమన్నారు. సర్కారు అరెస్టులు, నిర్బంధాలు, దాడులకు ఎదురు నిలిచి శాంతియుత ఉద్యమంతో విజయం సాధించిన రైతులు, మహిళలు, విద్యార్థులు, రైతు కూలీలు, మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలకు ఆయన ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి అజరామరమని లోకేశ్ అన్నారు. అమరావతిని కూల్చాలని, తరలించాలని దురాలోచనలు మానేయాలని సూచించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇకపై అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తే చరిత్రలో నిలుస్తుందని హితవు పలికారు.
క్షమాపణ చెప్పేంత వరకు చట్టసభలకు బంద్..