పరీక్షల నిర్వహణతో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే.. ఏపీలో మాత్రమే నిర్వహించేందుకు ఎందుకు పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. పరీక్షలు రద్దు చేయాలని రెండు నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు నోటీసులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతే సీఎం జగన్ తిరిగి తీసుకురాగలరా అని నిలదీశారు.
LOKESH: విద్యార్థుల ప్రాణాలకు సీఎం బాధ్యత వహిస్తారా? - తెదేపా నేత నారా లోకేశ్ తాజా సమాచారం
పరీక్షల నిర్వహణ కారణంగా.. విద్యార్థులకు కొవిడ్ ముప్పు పొంచి ఉన్నదని తెదేపా నాయకుడు నారా లోకేశ్ నిలదీశారు. సీఎం జగన్ మూర్ఖంగా విద్యార్థులను కరోనా కోరల్లోకి నెట్టేందుకు వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు.
నారా లోకేశ్