విద్యుత్ బిల్లెంత అని ప్రజల్ని అడిగే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్.. ఇప్పుడు ఏం చెబుతారని నిలదీశారు. జగన్ బాదుడు, దోపిడీకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో సంక్షేమం మూరెడు, విద్యుత్ బిల్లులు బారెడుగా ఉన్నాయని మండిపడ్డారు.
LOKESH: 'రెండున్నరేళ్ల పాలనలో.. ఐదు సార్లు వడ్డన..ఇదేం తీరు'
విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏం చెబుతారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి దిమ్మ తిరిగిపోతున్నాయన్నారు.
బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి దిమ్మ తిరిగిపోతుందన్నారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.4 వేల కోట్లు సర్దేస్తున్నారన్న లోకేశ్.. రెండున్నరేళ్ల పాలనలో ఐదు సార్లు ఛార్జీలు వడ్డించి 9వేల 69 కోట్లు దోచేశారని ఆరోపించారు. రకరకాల పేర్లతో ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ..జగన్ కేసులో కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ.. చివరి అవకాశమన్న కోర్టు