ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఫ్యాక్షన్ రాజకీయాలు ఆపకుంటే తీవ్ర పరిణామాలు'... నారా లోకేశ్ హెచ్చరిక - nara lokesh fiers on ycp over puramsetti ankulu murder

రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను ఇంతంటితో ఆపేయాలని.. లేకపోతే తర్వాత జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా పల్నాడులో దారుణ హత్యకు గురైన అంకులయ్య కుటుంబసభ్యులను లోకేశ్ పరామర్శించారు. అంకులు మృతదేహానికి నివాళులర్పించారు.

nara lokesh
nara lokesh

By

Published : Jan 4, 2021, 7:36 PM IST

Updated : Jan 5, 2021, 4:14 AM IST

మీడియాతో నారా లోకేశ్

ప్రభుత్వ అండతోనే.. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులపై వైకాపా వర్గీయులు దాడులకు తెగబడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. తెదేపా కార్యకర్తల హత్యలకు ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలన్నారు. తెదేపా నాయకుల మీద దాడులు జరిగితే ఇక మీదట చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. గుంటూరు జిల్లా పెదగార్లపాడులో నిన్న రాత్రి దారుణ హత్యకు గురైన తెదేపా నేత, మాజీ సర్పంచ్‌ పురంశెట్టి అంకులు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. ఆయన భార్య పున్నమ్మ, ఇతర కుటుంబసభ్యులను లోకేశ్‌ ఓదార్చారు. అంకులు మృతదేహం వద్ద నివాళులర్పించి...ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...

నేను జగన్ రెడ్డిగారికి హెచ్చరిక చేస్తున్నా... ఇక్కడితో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్​స్టాప్ పెట్టండి. పొరపాటున ఇంకో కార్యకర్త జోలికి వస్తే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత అవుతారని జగన్ రెడ్టికి హెచ్చరిక చేస్తున్నా. ఆంధ్రరాష్ట్రం ఇడుపులపాయ కాదు. ఆనాడు మేం తలుచుకుంటే.. మీరు పాదయాత్ర చేసేవారా..? ఒక్కసారి ఆలోచించు. మా ఓపికను పరీక్షించొద్దు. మళ్లీ ఇంకోసారి దాడి జరిగితే ..తర్వాత జరిగే పరిణామాలకు మీరే కారణం అవుతారు. మా కార్యకర్తల మీద దాడి జరిగితే మేం పారిపోయే బ్యాచ్ కాదని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.- లోకేశ్

ఎమ్మెల్యే, ఎస్సైల పాత్ర ఉంది.

అంకులయ్య హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్సై బాలనాగిరెడ్డి హస్తం ఉండవచ్చని లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. అంకులయ్య ఫోన్ కాల్ లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హత్య జరగడానికి ముందు ఎస్సై.. అంకులయ్యను మాట్లాడాలని పిలిపించారని చెప్పారు. ఎస్సై పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలన్నారు.

సంబంధిత కథనం:

దాచేపల్లిలో తెదేపా నేత దారుణ హత్య

Last Updated : Jan 5, 2021, 4:14 AM IST

ABOUT THE AUTHOR

...view details