ఫ్రంట్ లైన్ వారియర్స్, పారిశుధ్య కార్మికులు తమ పెండింగ్ జీతాలడిగితే అరెస్టులు చేశారని, కేసులు పెట్టారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. సొంత పత్రిక సాక్షికి మాత్రం సీఎఫ్ఎంఎస్ నుంచి 16.87 కోట్లు విడుదల చేశారని ఆరోపించారు.
రెండేళ్ల జగన్ పాలనలో అన్నమో రామచంద్రా అని ప్రజలు అల్లాడుతుంటే, తన పత్రికకు ఇప్పటి వరకూ 220 కోట్ల మొత్తాన్ని ప్రకటనల రూపేణా కట్టబెట్టారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను సీఎం జగన్.. సరస్వతి పవర్ కంపెనీకి కారుచౌకగా కేటాయించుకున్నారని దుయ్యబట్టారు.