"మీరు, మీ పార్టీ నేతల అరాచకాల నుంచి రక్షించే యాప్ ఉంటే చెప్పండి సీఎంసారూ, పోలీసులు, వాలంటీర్ల అరాచకాల నుంచి రక్షించే యాప్ ఉందా సీఎంసారూ?" అంటూ సీఎం జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో మహిళా పోలీసుల ప్రవర్తన చూశారా? అని ప్రశ్నించారు. తన ఇంటిముందు స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుంటే అడ్డుకున్న మీనాక్షమ్మ, ఆమె కుమార్తెను.. పోలీసులు నెట్టేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాటి మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులు చున్నీలతో బంధిస్తారా? అని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గ పాలనను ప్రజలంతా ఒక్కటై నిలదీయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.
మీ అరాచకాల నుంచి.. రక్షించే యాప్ ఉంటే చెప్పండి సీఎం సారూ : లోకేశ్
సీఎం జగన్పై తెదేపా నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. సీఎంతో పాటు వైకాపా నేతల అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా ఉంటే చెప్పాలని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లాలో మహిళను చున్నీలతో పోలీసులు బంధించడాన్ని ఖండించారు.
నారా లోకేశ్
Last Updated : Jun 3, 2022, 12:15 PM IST