ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కక్షతోనే అధికారులపై అక్రమ కేసులు : నక్కా ఆనందబాబు

tdp leader nakka anand babu : రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగల అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో నమోదు చేసినవన్నీ అక్రమ కేసులేనని దుయ్యబట్టారు.

tdp leader nakka anand babu slams ap government
tdp leader nakka anand babu slams ap government

By

Published : Dec 25, 2021, 4:36 PM IST

tdp leader nakka anand babu slams ap government: కక్షతోనే నిజాయితీపరులైన అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నాయని, వారు నిజాయితీ పరులైతే కోర్టు వాయిదాలకు ఏళ్ల తరబడి ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్​మెంట్ లో 241 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ.. లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావులపై పెట్టిన కేసులు అక్రమమేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు అన్నిరకాల పరికరాలూ సరఫరా చేసినట్టు అధికారులే ఒప్పుకొని సంతకాలు పెట్టాక, అవినీతి ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని నక్కా ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు.

nakka anand babu fires on ap government: కక్షసాధింపు కోసం అక్రమంగా ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, సంగం డెయిరీ విషయంలో ధుళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారని విమర్శించారు. 700 కోట్ల ఫైబర్ నెట్ ప్రాజెక్టులో 2వేల కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారని ఆనందబాబు ఎద్దేవాచేశారు. జగతి సంస్థలో జగన్ రెడ్డి కుటుంబం రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 1,246 కోట్లు పెట్టుబడిగా ఎలా వచ్చిందని సీబీఐ కోర్టు ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు.

విజయసాయిరెడ్డి, హెటిరోపై ఐటీ దాడులు చేయగా 1200 కోట్లు అక్రమ ఆస్తులను గుర్తించి సీజ్ చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 43వేల కోట్ల అవినీతికి పాల్పడి 19 కేసుల్లో ఏ1 ముద్దాయిగా లేరా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికే దక్షిణాది అబ్దుల్ కలాం అయిన గంటా సుబ్బారావుపై అక్రమ కేసుపెట్టి అన్యాయంగా జైల్లో పెట్టించారని నక్కాఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి:
ఎస్పీ నేత ఇంట్లో నల్లధనం.. విలువ రూ.177 కోట్లు!

ABOUT THE AUTHOR

...view details