రైతులు, మహిళలకు సీఎం జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పి వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ప్రభుత్వానికి మాయని మచ్చ అని ధ్వజమెత్తారు.
జైల్ భరోలో పాల్గొన్న మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానికి రైతులు, మహిళల ఉసురు తగులుతుందని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.