కొవిడ్ వ్యాప్తి కారణంగా కేబినెట్ భేటీ వాయిదా వేసిన ప్రభుత్వం.. పది, ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయదని తెదేపా నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. సీఎం, మంత్రులవే ప్రాణాలా.... విద్యార్థులవి కావా అంటూ మండిపడ్డారు. 30 మంది మంత్రులతో దూరంగా కూర్చుని నిర్వహించే కేబినెట్ సమావేశాన్ని రద్దు చేసినప్పుడు.. లక్షల మంది రాసే పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని ధ్వజమెత్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కరోనా సోకదా..?: నారా లోకేశ్ - nara lokesh latest news
పది, ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా కేబినేట్ భేటీ వాయిదా వేయటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేశ్