వైకాపా పాలన అంతా.. అరాచకరాలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. గ్రామ సర్పంచ్‌లపై వైకాపా నాయకులు మూకలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఉంగుటూరు సర్పంచ్ అనురాధ చెరువు మరమ్మతుల పనులు ఆరంభానికి ప్రయత్నించగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. సర్పంచ్ భర్త సోమశేఖర్, అతని అనుచరులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బెదిరించటం వైకాపా అరాచకాలకు అద్దం పడుతోందని ఆక్షేపించారు.
'తెదేపా నేతలపై పడిన ప్రతి దెబ్బకీ మూల్యం తప్పదు'
రెండేళ్ల జగన్ పాలనలో అరాచకాలు, విధ్వంసాలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. గ్రామ సర్పంచ్‌లు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామంటే, వైకాపా మూకలు దాడులకు తెగబడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
తెదేపా నేత నారా లోకేశ్
గ్రామంలో భయానక వాతావరణం సృష్టించిన నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం అన్యాయమని ఆగ్రహించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పడిన ప్రతి దెబ్బకి మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ తెల్చిచెప్పారు. ఉంగుటూరులో జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు లోకేశ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండీ..Mansas Trust: సంచైత నియామకం చెల్లదు: హైకోర్టు కీలక తీర్పు!