శనగ విత్తనాల పంపిణీలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ... తెదేపా నేత మల్లెల లింగారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు లేఖ రాశారు. విత్తనాలపై గతంలో ఉన్న 50 శాతం సబ్సిడీని 30 శాతానికి తగ్గించటం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
మార్కెట్ ధరతో సమానంగా రైతు భరోసా కేంద్రాల్లో రూ.5250కి విక్రయించటం విడ్డూరమని అభ్యంతరం వ్యక్తం చేశారు. 50 శాతం సబ్సిడీతో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి.. మంత్రి కన్నబాబును లేఖలో డిమాండ్ చేశారు.