వైకాపా ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. దళితుల మీద దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన సాగుతోందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుంటే దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యుడు సుధాకర్ విషయంలో ఫోన్ చేయలేదని మంత్రి సురేశ్ చెప్పారని...దానిపై విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటికొస్తాయని వ్యాఖ్యానించారు. కరోనా పేరుతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దందాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును విమర్శించే హక్కు వైకాపా నేతలకు లేదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు వైకాపాకు గుణపాఠం చెబుతారని అన్నారు.