ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తెదేపా నేతలపై తప్పుడు కేసులు.. క్షణాల్లో విచారణ పూర్తి' - tdp leader konakalla comments on kollu ravindra arrest news

రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తమ పార్టీ నేతలపై కేసులు పెడుతోందని తెదేపా నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుపై మండిపడ్డ ఆయన.. ఎలాంటి నేర స్వభావం లేని వ్యక్తులను జైళ్లకు పంపిస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

'తెదేపా నేతలపై తప్పుడు కేసులు.. క్షణాల్లో విచారణ పూర్తి'
'తెదేపా నేతలపై తప్పుడు కేసులు.. క్షణాల్లో విచారణ పూర్తి'

By

Published : Jul 5, 2020, 1:42 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని ఆ పార్టీ నేత కొనకళ్ల నారాయణ ఆరోపించారు. తెదేపా నేతలపై క్షణాల్లో విచారణ పూర్తి చేస్తున్నారని.. గతేడాది మార్చిలో జరిగిన వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని ఆయన ప్రశ్నించారు. తెదేపా అధినేత చంద్రబాబు కేవలం అభివృద్దిపైనే దృష్టి పెట్టారని.. వైకాపా ప్రభుత్వంలా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని అన్నారు.

ఎలాంటి నేర స్వభావం లేని వ్యక్తులను జైళ్లకు పంపిస్తున్నారన్న ఆయన.. కొల్లు రవీంద్రను కావాలనే బందరు సబ్‌జైల్లో ఉంచారని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని కొనకళ్ల పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details