ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు మార్గం సుగమం కావటంతో వైకాపా నేతల్లో అసహనం పతాకస్థాయికి చేరిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. కడపలో నిమ్మగడ్డ నిర్వహించిన మీడియా సమావేశంపై వైకాపా నేతలు అసభ్యంగా మాట్లాడారని తప్పుబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఓ ఐఏఎస్ అధికారి పనిచేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని పట్టాభి పేర్కొన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా ఇతర అధికారులు ఇలానే పనిచేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని హితవు పలికారు.
'వైకాపా నేతల్లో అసహనం పతాకస్థాయికి చేరింది' - పంచాయతీ ఎన్నికలపై తెదేపా నేత పట్టాబి వ్యాఖ్యలు
ఎస్ఈసీ నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంటే.. వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. కడపలో నిమ్మగడ్డ నిర్వహించిన మీడియా సమావేశంపై వైకాపా నేతలు అసభ్యంగా మాట్లాడారని దుయ్యబట్టారు.
tdp leader komma reddy pattabhi comments on ysrcp government