ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు

సెంటు భూమి పేరుతో వైకాపా నేతలు 4వేల కోట్లను దోచుకున్నారని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా...ఒక్క ఇంటినీ నిర్మించలేకపోయిందన్నారు.

tdp leader kalava srinivasulu
tdp leader kalava srinivasulu

By

Published : Oct 29, 2020, 10:18 PM IST

అవినీతిని కొనసాగించుకునేందుకే ఇళ్ల పట్టాల పంపిణీని వైకాపా ప్రభుత్వం వాయిదా వేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. సెంటు భూమి పేరుతో వైకాపా నేతలు ఇప్పటికే 4వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కుట్రను కప్పిపుచ్చుకునేందుకు తెదేపాపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

వైకాపా అధికారం చెపట్టిన ఏడాదిన్నరలో ఒక్క ఇంటినీ నిర్మించకపోగా తెదేపా హయాంలో నిర్మించి ఇచ్చిన ఇంటి తాళాలను లబ్ధిదారుల నుంచి వెనక్కి లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. నిర్మాణం పూర్తైన 2.62లక్షల టిడ్కో ఇళ్లను 17నెలలుగా ఇవ్వకపోవటంతో పాటు 50శాతం పైగా పనులు పూర్తైన 4,96,572 ఇళ్లను ఇంతవరకూ పూర్తి చేయకపోవటాన్ని తప్పుబట్టారు. వైకాపా దుర్మార్గాల వల్ల లబ్ధిదారులు ఇంకా అద్దెలు, వడ్డీలు కట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details