వీసీల నియామకంలో బీసీలకు జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉందా..? అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులను విదేశీ విద్యకు దూరం చేశారని మండిపడ్డారు. 1187 బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను జగన్ ప్రభుత్వం నిలిపేసి.. ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు తెదేపా ఒక్కటే అసలైన రాజకీయ వేదికని స్పష్టం చేశారు. వైకాపా అంటేనే అవినీతి, అరాచకమన్న ఆయన... జగన్ పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పడం హాస్యాస్పదమన్నారు.
వీసీల నియామకంలో బీసీలకు అన్యాయం: కాల్వ శ్రీనివాసులు - tdp leader kalava srinivasulu slams ycp govt
వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. వీసీల నియామకాల్లో బీసీలకు తీవ్రంగా అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను దారి మళ్లీస్తున్నారని ఆరోపించారు.
tdp leader kalava srinivasulu