ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గృహనిర్మాణానికి రూ.500కోట్లు మాత్రమే ఖర్చు చేశారు: కాలవ శ్రీనివాసులు - kalava srinivasulu criticizes on ycp government

వైకాపా ప్రభుత్వంపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల సొంతింటికలను నిజం చేసే దిశగా చొరవచూపడం లేదని ఆయన విమర్శించారు. నిర్మాణంలో ఉన్న 4లక్షల 80వేల ఇళ్లను అర్ధాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం దీని కోసం రూ. 500 కోట్లే ఖర్చు చేసిందన్నారు.

kalava srinivasulu
kalava srinivasulu

By

Published : Nov 19, 2020, 6:48 PM IST

బడ్జెట్​లో గృహనిర్మాణానికి రూ.3500మాత్రమే కేటాయించిన ప్రభుత్వం వాటిలో కేవలం రూ.500కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వైకాపా అధికారంలోకి వచ్చాక 25లక్షల మందికి సొంతింట కల శాశ్వతంగా దూరమైంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పథకాలతో మొత్తం 28 లక్షల గృహాలను తెదేపా ప్రభుత్వం నిర్మించి రూ.56వేల కోట్లు ఖర్చు చేసింది. 4లక్షల 80వేల ఇళ్లను అర్థంతరంగా రద్దు చేశారు. తెదేపా ప్రభుత్వం 300 చదరపు అడుగుల్లో బహుళ అంతస్తుల ఇళ్లు నిర్మిస్తే వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా రూపాయి కట్టించుకుని ఇళ్లు ఇస్తామనటం మోసపూరితమే. సెంటు పట్టా పథకంలో భారీ అవినీతికి బాటలు వేసిన వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా దండుకుంటోంది. పేదలకు సెంటు భూమి బదులు గ్రామాల్లో రెండున్న సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లను అర్హులకు ఇవ్వాలి. వచ్చే బడ్జెట్లో అయినా తగినన్ని కేటాయింపులు చేసి,

ABOUT THE AUTHOR

...view details