ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా కార్యాలయం కుట్రలకు కేంద్రంగా మారింది: కళా వెంకట్రావు

By

Published : Sep 17, 2020, 1:51 PM IST

తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం.. కుట్రలకు కేంద్రంగా మారిందని.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నీ అక్కడి స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయని.. తెదేపా నేత కళా వెంకట్రావు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ 15 నెలల పాలనలో అవినీతి తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు.

kala venkatrao
కళా వెంకట్రావు, తెదేపా నేత

తమ ప్రభుత్వం చేస్తున్న అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడం తప్ప 15 నెలల పాలనలో వైకాపా చేసిందేంటని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు నిలదీశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు బనాయించి ప్రజల సొమ్మును దుబారా చేసిందే తప్ప.. సాధించిందేమీ లేదని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం కుట్రలకు కేంద్రంగా మారిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలన్నీ అక్కడి స్క్రిప్టు ప్రకారమే జరుగుతున్నాయని ఆరోపించారు.

3 రాజధానుల పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ 15 నెలల పాలనలోనే అనేక కుంభకోణాలు.. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వెలుగులోకి వచ్చాయని కళా దుయ్యబట్టారు. వైకాపా నేతలు రాష్ట్రంలోని దేవాలయ భూములు, హుండీల్లోని డబ్బులు కొట్టేస్తున్నారని సొంత పార్టీ ఎంపీనే ఆరోపించారన్నారు. వీటిపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details