ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారు : కళా వెంకట్రావు - తెదేపా నేత క‌ళా వెంక‌ట్రావు వార్తలు

మాట తప్పి మడమ తిప్పడం జగన్‌ నైజమని తెదేపా నేత క‌ళా వెంక‌ట్రావు విమర్శలు చేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదల పొట్ట కొట్టారని ధ్వజమెత్తారు.

tdp leader kala venkatrao
tdp leader kala venkatrao

By

Published : Aug 13, 2020, 2:23 PM IST

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు విమర్శించారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న మేనిఫెస్టో హామీల్లోనే మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారని.. సన్నబియ్యం హామీపై అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారని.. వాహన మిత్రను యజమానులకు పరిమితం చేసి డ్రైవర్లను మోసగించారని దుయ్యబట్టారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదల పొట్ట కొట్టారని కళా మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details