జగన్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అవుతారనే రాజ్యాంగ పెద్దలు న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేశారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోకుంటే కోర్టుకి నడవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నవరత్నాలను నమ్మి ఓట్లు వేసిన జనాన్ని జగన్ నట్టేట ముంచారని దుయ్యబట్టారు. విధ్వంసానికి మారుపేరుగా వైకాపా పాలన నడుస్తోందన్న ఆయన....ఏడాది కాలంలోనే వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలకు న్యాయ వ్యవస్థ లేకపోతే రాష్ట్రం నాశనమయ్యేదన్నారు.
విధ్వంసానికి మారుపేరుగా వైకాపా పాలన: కళా - kala venkata rao on ycp governance news
సీఎం జగన్పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. విధ్వంసానికి మారుపేరుగా జగన్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
kala-venkata-rao