వైకాపా ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికలు ప్రహసనంగా మారాయని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ప్రభుత్వం ఓ మనిషిని వాచ్‌మెన్‌లా పెట్టిందని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు ఉండవని చట్ట సవరణ చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. అన్నీ ఏకగ్రీవాలు చేసుకునే దానికి ఎన్నికల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు: బండారు సత్యనారాయణ