ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అనుభవలేమితో రాష్ట్రం చిక్కుల్లో పడింది' - వైకాపాపై తెదేపా నేతలు విమర్శలు

ప్రభుత్వానికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. సీఎం జగన్‌ అనుభవలేమితో రాష్ట్రం సమస్యల్లో చిక్కుకుందని విమర్శించారు.

tdp-leader-kala-venkat-rao-letter-to-government

By

Published : Oct 12, 2019, 10:59 PM IST

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌ ఆరోపించారు. ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. పౌరహక్కులను హరిస్తూ సీఎం జగన్‌... నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులు ప్రజలను కలవరపెడుతున్నాయని ఆరోపించారు. అధికారుల స్పందన కోసం ఓ ఎమ్మెల్యే రాత్రంతా మున్సిపల్‌ కార్యాలయంలోనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. జగన్‌ అనుభవలేమి, అవగాహనారాహిత్యం వల్ల... రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details