తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 6 గంటల పాటు సాగిన భేటీలో.. ఏయే అంశాలను చర్చించారో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. విభజన సమస్యల పరిష్కారం కోసం అయితే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, అధికారులను ఎందుకు తీసుకెళ్లలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన....కేవలం కేసుల మాఫీ కోసం సాయాన్ని అర్థించడానికే జగన్... కేసీఆర్ను కలిశారని విమర్శించారు.ఈ భేటీలో కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారినే జగన్ వెంట వెళ్లారని...ఇదేనా సామాజిక న్యాయమని కళా నిలదీశారు. ఉప ముఖ్యమంత్రులను అవమానపరచడమేనన్న కళా... తన అవసరాన్ని తీర్చుకునేందుకు జగన్, విజయసాయిరెడ్డి ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు.
చర్చలకు వాళ్లు పనికి రారా..?: కళా వెంకట్రావు - జగన్తో కేసీఆర్ భేటీ వార్తలు
తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య జరిగిన సమావేశంలో..ఏయే అంశాలను చర్చించారో ప్రజలకు చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
![చర్చలకు వాళ్లు పనికి రారా..?: కళా వెంకట్రావు tdp leader kala fire on cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714182-1104-5714182-1579031389568.jpg)
tdp leader kala fire on cm jagan
ఇదీ చదవండి : రాజధాని తరలిస్తున్నామని మేం చెప్పలేదు: హోం మంత్రి