రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడి లక్షలాదిమంది విద్యార్ధులు.. చదువుకు దూరమయ్యేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయంటూ సీఎం జగన్కు మాజీ మంత్రి జవహర్ బహిరంగ లేఖ రాశారు. పాఠశాలల అభివృద్ధి అంటే.. కమీషన్ల కోసం నాడు - నేడు నిర్వహించటం కాదని విమర్శించారు. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు బోధనా రుసుములు చెల్లింపు ఎగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మఒడి పేరుతో బోధనా రుసుములు ఎగ్గొట్టారు : తెదేపా నేత జవహర్ - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్డేట్స్
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, అవగాహన రాహిత్యంతో.. విద్యావ్యవస్థలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధమస్థానానికి పడిపోయిందని మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. నూతన విద్యావ్యవస్థ, ఆంగ్లమాద్యమం, ఎయిడెడ్ వ్యవస్థ నిర్వీర్యం వంటి చర్యలతో గందరగోళం సృష్టించి ఉపాధ్యాయ రంగాన్ని అవహేళన చేశారని ఆరోపించారు.
tdp leader
ఎస్సీ విద్యార్థులకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాలను రద్దు చేశారని ఆక్షేపించారు. సీపీఎస్ రద్దు, డీఏ పెంపు హామీలు విస్మరించి ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటిపైనా ఆత్మపరిశీలన చేసుకుని, విద్యార్థులు, తల్లితండ్రుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు