తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం చెప్పాలని మాజీమంత్రి జవహర్ డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక సోము వీర్రాజు ఏపీకి ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు మీద ట్వీట్లు పెడితే ఓట్లు రావని గ్రహించాలని జవహర్ హితవు పలికారు.
'ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?' - tdp comments on bjp
ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. హామీలను ప్రజలు అడుగుతారనే భయంతో ఉన్నారని అన్నారు.
tdp leader jawahar comments on somuveeraju