దొంగ, పోలీస్ ఒకటయ్యాక పరిషత్ ఎన్నికలు జరిపినా.. జరపకపోయినా ఒక్కటేనని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. ఎస్ఈసీ జగన్ బంట్రోతులా పని చేస్తోందని దుయ్యబట్టారు. జగన్ సంతృప్తి కోసమే కమీషనర్ పనిచేస్తూ... వచ్చిన రోజే షెడ్యూల్ ప్రకటించారని విమర్శించారు. 5 దఫాలుగా జరగాల్సిన ఎన్నికల్ని ఇంత తొందరపాటుగా ఒక్క రోజులో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనీసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుని ఉంటే వెన్నుముక ఉన్న ఎస్ఈసీ అనుకునే వాళ్లమని ఎద్దేవా చేశారు.
జగన్ సంతృప్తి కోసమే ఎస్ఈసీ పని చేస్తున్నారు: జవహర్ - ఎస్ఈసీ నీలంసాహ్ని పై జవహర్ కీలకవ్యాఖ్యలు
ఎస్ఈసీపై తెదేపా నేత జవహర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలను సంప్రదించకుండా..పదవి చేపట్టిన రోజే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని జవహర్ నిలదీశారు.
తెదేపానేత జవహర్