కొడాలి నాని మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆయన తీరు చూస్తుంటే మూడు రాజధానుల గురించి కొడాలి నానినే జగన్కు చెప్పినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. కొడాలి నాని తిట్ల పురాణంతో.. తన పరువుతో పాటు తన కుటుంబ పరువును రోడ్డుకీడుస్తున్నారని విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకుని తన కుటుంబసభ్యులను ఎవరూ తిట్టకుండా చూసుకోవాలని హితవు పలికారు.
కొడాలి నాని.. 3 రాజధానుల గురించి సీఎంకు మీరే చెప్పారా..?: జవహర్
వైకాపా నేత కొడాలి నాని అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత జవహర్ మండిపడ్డారు. కొడాలినాని తిట్ల పురాణంతో తన పరువు తానే తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల గురించి కూడా సీఎం జగన్ కు కొడాలి నానినే చెప్పారా అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
tdp leader javaher