ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"ప్రభుత్వం కాగ్‌కు.. తప్పుడు లెక్కలు సమర్పించింది" - TDP leader GV Reddy updates

రాష్ట్ర ప్రభుత్వం కాగ్​కు.. తప్పుడు లెక్కలు సమర్పించిందని.. తెదేపా నేత జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పులను, ఖర్చులను తక్కువ చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రికి పారదర్శకత ఉంటే అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీవీ రెడ్డి
జీవీ రెడ్డి

By

Published : Jun 20, 2022, 6:17 PM IST

'కాగ్‌కి ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పించింది'
వైకాపా ప్రభుత్వం.. కాగ్​కు తప్పుడు లెక్కలు సమర్పించిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పులను, ఖర్చులను తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం మొత్తం రూ.66 వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి పారదర్శకత ఉంటే.. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం శ్రీలంకను మించి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీస్తుందన్నారు. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించి, ప్రజలు వైకాపా నాయకులను నిలదీయాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details