ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇన్నిరోజులు పోలీసులు కళ్లు మూసుకుని కూర్చున్నారా: గోరంట్ల బుచ్చయ్య - ysrcp leaders attack on chandra baby house

ముఖ్యమంత్రి, మంత్రులు.. ప్రతిపక్ష నాయకుడిపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు డీజీపీకి వినిపించలేదా అని తెదేపా నేత గోరంట్ల బచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అయ్యన్న వాస్తవాలు చెబితే భరించలేకపోతున్నారని అన్నారు. తెదేపా శ్రేణులు, నాయకులు క్రమశిక్షణతో ఉంటారని.. తెదేపా క్రమశిక్షణ తప్పితే వైకాపా నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు.

tdp leader gorantla comments on ysrcp government and dgp
tdp leader gorantla comments on ysrcp government and dgp

By

Published : Sep 18, 2021, 9:19 AM IST

ముఖ్యమంత్రి, మంత్రులు.. ప్రతిపక్ష నాయకుడిపై నీచమైన భాష ఉపయోగించినప్పుడు డీజీపీకి అది కనిపించలేదా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి నిలదీశారు. అయ్యన్నపాత్రుడు వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణ ఉంటారని.. ఆ క్రమశిక్షణ తప్పితే వైకాపా నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఒక చెంప మీద కొడితే తిరిగి రెండు చెంపల మీద కొట్టే సత్తా తెలుగుదేశం కార్యకర్తలుకు, నాయకులకు ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details