రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భాజపా నేతలు ఏం సమాధానం చెప్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని గతంలో తేల్చి చెప్పిన కేంద్రం.. పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు ఎలా ప్రకటించారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.. ఈ హామీని ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు విజృంభిస్తుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాల నాయకులు ఎందుకు స్పందించట్లేదని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నాయకులు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బొప్పరాజులు ఎక్కడున్నారని అన్నారు. కొవిడ్ రెండో దశ ప్రమాదం కాదా.. లేక సీఎం జగన్కు భయపడి నోరు మెదపటం లేదా అని సయ్యద్ రఫీ ఎద్దేవా చేశారు.