వైకాపా ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారని, మాఫియాకు తప్ప ఇతరులకు ఇసుక దొరకడంలేదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని... వారి ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'కేకు సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యం' - మాజీ మంత్రి దేవినేని ఉమ
వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. ఈ ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ పాలనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని గుర్తు చేశారు.
'కేకు సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యం'
పేదలకు ఇళ్లస్థలాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రూ.25లక్షలు విలువచేసే నివాసయోగ్యంకాని భూమికి రూ.55లక్షలు చెల్లింపులు చేశారని ఆరోపించారు. రైతులను దోపిడీ చేస్తున్న భూకుంభకోణంపై ఏం చర్యలు తీసుకున్నారో జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.