తుది శ్వాస వరకు తెదేపాలోనే: దివ్వవాణి - tdp leader divya vani react on party change
తుది శ్వాస వరకు తెదేపాను వీడేది లేదని ఆ పార్టీ నాయకురాలు, సినీ నటి దివ్వవాణి స్పష్టం చేశారు. భాజపాలో చేరుతున్నాను అంటూ వస్తున్న వార్తలను ట్విట్టర్ వేదికగా ఖండించారు.
తుది శ్వాస వరకు తెదేపాలోనే: దివ్వవాణి
తన తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆ పార్టీ నాయకురాలు దివ్వవాణి స్పష్టం చేశారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. తాను భాజపాలో చేరుతున్నా అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ట్విట్టర్ వేదికగా ఖండించారు.