ఎస్ఈసీ నియామకం విషయంలో ప్రభుత్వం సరికొత్త సంప్రదాయాలకు తెర లేపిందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ వ్యవహారంలో మలుపులు, దాగుడుమూతలు అవసరమా అని ప్రశ్నించిన ఆయన.. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. పేరు లేకుండానే ఫైలు నడిపారని మండిపడ్డారు. ప్రజాహితం లేని ఆర్డినెన్స్ జారీలో లోపాలకు సీఎం జవాబు చెప్పాలని ఉమా ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.
'ఎస్ఈసీ ఆర్డినెన్స్ జారీలో లోపాలకు సీఎం సమాధానం చెప్పాలి' - devineni comments on sec ordinance
ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వం ఇష్టారీతిన జీవోలు జారీ చేసిందని తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రజాహితం లేని ఆర్డినెన్స్ జారీలో లోపాలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఎస్ఈసీ ఆర్డినెన్స్ జారీలో లోపాలకు సీఎం సమాధానం చెప్పాలి'
ఇదీ చూడండి..
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులు వెనక్కి