ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతి రైతులకు తెదేపా అండగా ఉంటుంది' - అమరావతి రైతుల అరెస్టుపై దేవినేని ఉమా ఆగ్రహం

అమరావతి రైతులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన వారిని విడుదల చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న రైతుల కుటుంబ సభ్యులను దేవినేని ఉమా పరామర్శించారు.

tdp leader devineni uma visit arrested amravathi farmers  families
అరెస్టైన రైతు కుటుంబాలను పరామర్శించిన దేవినేని ఉమా

By

Published : Nov 3, 2020, 10:26 AM IST

అమరావతి రైతులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అన్యాయంగా సంకెళ్లు వేసి జైలుకు పంపుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని నిరహార దీక్ష చేస్తున్న రైతుల కుటుంబసభ్యులను ఉమా పరామర్శించారు.

తెదేపా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉద్యమం జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దేవినేని ఉమా ఆరోపించారు. 5కోట్ల ప్రజల కోసం 29వేల మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని ఉమా అన్నారు. ఈ త్యాగాన్ని ప్రభుత్వం కాలరాస్తోందన్ని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై విచారణ 5కి వాయిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details