ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Devineni uma: 'పాడి పరిశ్రమను అమూల్‌కు ధారాదత్తం చేసే అధికారం సీఎంకు ఎవరిచ్చారు?' - సీఎం జగన్​పై దేవినేని ఆరోపణలు

రాష్ట్రంలో పాడి పరిశ్రమను గుజరాత్ అమూల్‌కు ధారాదత్తం చేసే అధికారం జగన్‌కు ఎక్కడిదని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. వివిధ రాష్ట్రాల్లో అమూల్‌ను వ్యతిరేకించినా.. మన రాష్ట్రంలో స్వాగతించడమేంటని ప్రశ్నించారు. తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడలో పరామర్శించిన దేవినేని ఉమ.. తప్పుడు కేసులతో ఆయనను వేధించారని మండిపడ్డారు.

Devineni uma
Devineni uma

By

Published : Jun 5, 2021, 1:52 PM IST

రాష్ట్రంలో పాడి పరిశ్రమను గుజరాత్​లో అమూల్‌కు ధారాదత్తం చేసే అధికారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు. వివిధ రాష్ట్రాల్లో అమూల్‌ను వ్యతిరేకించారన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ డైరీ పరిశ్రమలను బెదిరించి అమూల్‌కు కట్టబెట్టారని దుయ్యబట్టారు. అమూల్‌కు వచ్చే లాభాలు అన్ని కూడా.. గుజరాత్​లో ఉన్న షేర్ హోల్డర్స్‌కి వెళ్లడమే తప్ప రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులు ఎన్ని వచ్చినా వైకాపా నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదని దేవేనేని ఆక్షేపించారు.

తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో పరామర్శించారు. వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పాడి రైతులకు అమూల్‌ చెల్లించే డబ్బులు కంటే రాష్ట్రంలో ఉన్న డైరీలు అధిక మొత్తంలో చెలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం ద్వారా వైకాపా నాయకులు కోట్ల రూపాయలు ప్రజల నుంచి దండుకున్నారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు బోగస్ భరోసా కేంద్రాలుగా మారాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details