మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం కర్నూలులో సీఐడీ విచారణకు గైర్హాజరయ్యారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని, వీడియోను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారన్న అభియోగంపై ఈ నెల 10న ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.
కర్నూలు ప్రాంతీయ సీఐడీ అధికారి రవికుమార్‌కు కేసు విచారణ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో.. ఈ నెల 15న విచారణకు హాజరుకావాలంటూ మొదటి నోటీసు జారీ చేశారు. ఆ రోజున ఉమా గైర్హాజరవడంతో ఈ నెల 19న రావాలని మరో తాఖీదు ఇచ్చారు. సోమవారమూ రాకపోవడంతో మరోసారి నోటీసు ఇస్తామని, అప్పటికీ స్పందించకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తామని రవికుమార్ తెలిపారు.