రాష్ట్రంలో సాగుతున్న రాక్షస, ఆటవిక పాలన నుంచి న్యాయస్థానాలే ప్రజలను కాపాడుతున్నాయని మాజీమంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలు న్యాయ సమీక్షలో నిలవకపోయినా, పాలకుల వైఖరి మారడం లేదని ఆక్షేపించారు.
విశాఖపట్నంలో కొట్టేసిన 32వేల ఎకరాలను అమ్ముకోవడానికి అక్కడ రాజధాని అంటున్నారు తప్ప, ప్రజలను ఉద్దరించడానికి కాదని దేవినేని ఉమ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒక్క కరోనా ఆసుపత్రినైనా సందర్శిస్తే.. వాస్తవాలు తెలుస్తాయని స్పష్టంచేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్న 500 రూపాయల భోజనం... మంత్రులు తిని, ఎలా ఉందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. విజయవాడ ఫ్లైఓవర్ తామే కట్టామని చెబుతున్నారన్న ఆయన... రేపు పోలవరం, పట్టిసీమ కూడా తామే పూర్తి చేశామని చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం ఎందుకు నిలిపేసిందని నిలదీశారు.