రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పును కూడా వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. సుప్రీంకోర్టు మూడుసార్లు స్టే తిరస్కరించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులకు ప్రజాసంక్షేమం తప్ప వ్యక్తిగత కక్షలు ఉండకూడదన్న ఉమా... నియంతృత్వం చెల్లదంటున్న ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పగలరా అని నిలదీశారు.
'కోర్టులంటే లెక్క లేదా... తీర్పులు అమలు చేయరా..?' - ఏపీ టూడే న్యూస్
ఎస్ఈసీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వైకాపా ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం మూడుసార్లు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించినా ప్రభుత్వం తీరు మారలేదని విమర్శించారు. వైకాపా కక్షసాధింపు పాలన చేస్తుందని ఆక్షేపించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా