రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. కారు దింపిన తర్వాత వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడికి గురయ్యారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో జైలు కెళ్లిన విజయసాయిరెడ్డి.. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదని అన్నారు. తెదేపా హయాంలో జలవనరుల్ని దేశంలో రెండో స్థానంలో నిలబెడితే.. వైకాపా నేతలు 108 అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశారని దేవినేని ట్విటర్ వేదికగా ఆరోపించారు. బెయిల్పై వచ్చిన ఎంపీ.. ప్రతిపక్షాలపై బెదిరింపులు ఆపాలని హితవు పలికారు.
కారు దింపిన తర్వాత విజయసాయి ఒత్తిడికి గురయ్యారు: దేవినేని - tdp leader devineni comments on ycp mp vijaysai news
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కేసుల్లో జైలుకెళ్లిన విజయసాయి.. బెయిల్పై వచ్చి ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అంబులెన్సుల్లో రూ.307 కోట్లు కొట్టేశారని ఆరోపించారు.
కారు దిగిన తర్వాత విజయసాయి ఒత్తిడికి గురయ్యారు: దేవినేని