రాష్ట్రవ్యాప్తంగా పక్కా ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు వెళ్లినరోజే విజయసాయిరెడ్డి రామతీర్థం ఎందుకు వెళ్లారని ఉమ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, మంత్రి బొత్సలను ఆలయం లోపలికి వెళ్లనిచ్చి...చంద్రబాబును మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని నిలదీశారు.
సాయిరెడ్డి, బొత్సలకు ఎందుకు గుడి తలుపులు తెరిచారు?: దేవినేని - రామతీర్థం వార్తలు
రామతీర్థం గుడి లోపలికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్సలను వెళ్లనిచ్చి...ప్రతిపక్షనేత చంద్రబాబును మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు.

తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు