మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. సీఎం ఆనందం కోసం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి సీఐడీ ముందుకెళ్తున్నాన్న ఆయన.. రాత్రి 10 వరకు లోపల కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
తనతో పాటు ధూళిపాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 9 గంటలపాటు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడతారా..? ధాన్యం పెద్దఎత్తున దోపిడీ జరుగుతుంటే సీఎం స్పందించరు. మంత్రులు ధాన్యం దళారుల ముసుగు కప్పుకుంటే పట్టించుకోరు. ధాన్యం దోపిడీపై నాపై ఏ కేసు పెడతారో పెట్టుకోండి. రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధం-దేవినేని ఉమ, తెదేపా నేత