ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు పెట్టిన కేసు మధ్యలో ఎస్సీ ఎస్టీ చట్టం ఎక్కడినుంచి వచ్చిందని తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ప్రశ్నించారు. లేని అవినీతిని చూపించడానికి పిల్లిమొగ్గలు వేస్తున్న జగన్ రెడ్డిని చూస్తుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. అంత చిన్నపిల్లల ఆటలు ఆడుకోవాలనుకుంటే పక్కకెళ్లి ఆడుకోవాలని హితవు పలికారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియంత పాలనకు త్వరలోనే స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
జగన్ రెడ్డిని చూస్తుంటే నవ్వొస్తోంది: చింతమనేని - Chintamaneni Prabhakar latest news
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.
చింతమనేని ప్రభాకర్