సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం నడుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. గూండాలు ప్రజల్ని పాలిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తూ... ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు కళ్లు మూసుకుంటే.. న్యాయస్థానాల తీర్పులు ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.
'రౌడీరాజ్యంలో ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు' - tdp leader ayyanna comments on ycp ruling news
ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడవద్దన్న ఆయన.. న్యాయస్థానాల తీర్పులు ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ఎస్ఈసీ వ్యవహారంలో సుప్రీం తీర్పు వైకాపాకు చెంపపెట్టని ఎద్దేవా చేశారు.
'రౌడీరాజ్యంలో ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు'
రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడవద్దని అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. ముఖ్యమంత్రి చేసిన తప్పునకు ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులతో రాజీనామాలు చేయించడం సరికాదని తెలిపారు. ఏడాది కాలంలో ఓ ప్రభుత్వానికి హైకోర్టు 70సార్లు మొట్టికాయలు వేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. సీఎం నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..విజయసాయి రెడ్డి ట్వీట్‌కు రామ్మోహన్ ఘాటు కౌంటర్