రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలకు వరద కష్టాలు వచ్చాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఏడాదిన్నరగా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరుస విపత్తులతో రైతులు నష్టపోయినా ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ముంపు ప్రాంతాల్లో ఉన్నవారికి ఆహారం, తాగునీరు కూడా అందించలేదని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితులకు సహాయక చర్యలు చేపట్టి ఉచిత వైద్య శిచిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.