విద్యాకానుక పథకంపై వైకాపా బహిరంగ చర్చకు రావాలని తెదేపా అధికార ప్రతినిధి చెంగల్రాయుడు సవాల్ విసిరారు. విద్యార్థుల తల్లిదండ్రులే ఈ పథకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకులు ప్రచారం కోసం తప్ప పథకం వల్ల విద్యార్థులకు ఉపయోగం లేదని విమర్శించారు. అమ్మఒడి ఇస్తున్నామంటూ ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల ఉపకారవేతనాలు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వం బడ్జెట్లో 25.5 శాతం నిధులు విద్యారంగానికే ఖర్చు పెట్టిందని చెంగల్రాయుడు గుర్తు చేశారు.
విద్యాకానుకపై వైకాపా బహిరంగ చర్చకు రావాలి: చెంగల్రాయుడు
జగనన్న విద్యాకానుక పథకంపై తల్లిదండ్రులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెదేపా నేత చెంగల్రాయుడు అన్నారు. వైకాపా ప్రభుత్వం కేవలం ప్రచారం చేయడం తప్ప.. విద్యార్థులకు ఒరిగిందేమీ లేదన్నారు.
tdp leader chengalrayudu