తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ సాగే గేయాన్ని తరగతి గదిలో ఆలపించిన బాలికను తెదేపా నేత చంద్రబాబు అభినందించారు. పాట వీడియోని తన ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ఆయన.. విద్యార్థిని అద్భుతంగా ఆలపించిందంటూ ప్రశంసించారు. పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోందని ప్రశంసించారు. అలాంటి తెలుగును ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా.. పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు గొప్పతనం తెలిసేలా విద్యార్థిని పాట.. అభినందించిన చంద్రబాబు
తెలుగు భాష గొప్పతనం తెలిసేలా పాట పాడిన విద్యార్థినిని అభినందిస్తూ తెదేపా నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. పాటలోని సాహిత్యం తెలుగు భాషపై ఉన్న మమకారాన్ని తెలుపుతుందన్నారు.
వీణియ నాద వినోదంలా అంటూ సాగిన ఈ పాటను గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని హారిస్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోన్న జిమీనియామూన్ ఎంతో మధురంగా ఆలపించింది.ఈ పాటనుతెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అమరవాది రాజశేఖర శర్మ రచించారు. రాజశేఖర శర్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి పాడిన ఈ పాటను గతేడాది సెప్టెంబర్‌లో యూట్యూబ్‌లో పెట్టారు. ఈ పాటను నేర్చుకున్న జిమీనియామూన్ తాజాగా పాఠశాలలో ఆలపించింది. ఆ విద్యార్థిని ఆలపించగా తీసిన వీడియోని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఇదీ చదవండి:వైకాపా పాలనలో నగరాలు పతనం: చంద్రబాబు