ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu: ఎన్డీయేలో చేరికపై చంద్రబాబు ఏమన్నారంటే..!

CBN ON NDA
CBN ON NDA

By

Published : Sep 1, 2022, 4:17 PM IST

Updated : Sep 1, 2022, 8:16 PM IST

16:10 September 01

రాష్ట్ర విభజన వల్ల కంటే.. జగన్ వల్లే రాష్ట్రానికి నష్టం ఎక్కువ

రాష్ట్ర విభజన వల్ల కంటే.. జగన్ వల్లే రాష్ట్రానికి నష్టం ఎక్కువ

CBN CHIT CHAT : విజన్‌తో తాను పని చేస్తే, విద్వేషంతో జగన్ పని చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విజన్ ఉంటే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని.. హైదరాబాద్‌ విషయంలో చేసి చూపించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్రంతో సంబంధాలను చూస్తామన్న చంద్రబాబు.. ఎన్డీఏలో చేరుతున్నారా అనే ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పలేదు.

ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి 27 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విజన్ ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి తప్ప, విద్వేషంతో కాదన్నారు. తాను విజన్‌తో పనిచేస్తే, జగన్ విద్వేషంతో పని చేస్తున్నారని విమర్శించారు. రాజకీయం వేరు అభివృద్ధి వేరు అనే విషయాన్ని తాను అచరిస్తే.. జగన్‌రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్‌రెడ్డి విధ్వంసం చేసిన అమరావతిని పునర్ నిర్మించాల్సి ఉందన్నారు.

రాష్ట్ర విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే.. ఇప్పుడు జగన్ పాలనతోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ హయాంలో తిరుపతిని హార్డ్ వేర్ హబ్‌గా తీర్చిదిద్దితే.. అలాంటి ప్రాంతంలో ఉన్న అమరరాజా సంస్థపై వైకాపా ప్రభుత్వం దాడి చేసిందన్నారు. అలాగే విశాఖ నుంచి అనేక సంస్థలను తరిమేశారని మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలో కొనసాగి ఉంటే 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌-1 స్థానానికి చేరేదన్నారు. చూస్తుండగానే 27ఏళ్ల కాలం గడిచిపోయిందన్న చంద్రబాబు.. నాటి ఐటీ విప్లవంతో నేడు హైదరాబాద్ రూపురేఖలు ఎంతోమారిపోయాయన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ కృషితో హైదరాబాద్ విశ్వవ్యాప్త నగరంగా అందరి ఆదరణ పొందుతోందన్నారు. ఆనాడు తన విజన్‌ని ఎగతాళి చేసిన వారి పిల్లలు కూడా.. ఇప్పుడు ఐటీలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామంటూ.. జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ అమలును ప్రస్తావించారు. ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగుపరిచి మంచి ఫలితాలు సాధించామన్నారు.

ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఓ ఇంజినీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల వచ్చాయని గుర్తు చేశారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా కేంద్రంలో కూడా కొన్ని విధానపరమైన మార్పులకు కృషి చేశామన్న చంద్రబాబు.. అప్పటి ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి జాతీయ రహదారుల అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. టెలికం రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రంపై ఒత్తిడి చేశామన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో.. తెలుగుదేశం రెండుసార్లు నష్టపోయిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలనే తపనతో.. పార్టీ పరంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. రాష్ట్ర విభజన పట్ల 2014 నాటికి ప్రజల్లో భయాందోళనలు ఉన్నా, ఆర్థికలోటు వేధిస్తున్నా.. తెలంగాణ కంటే మెరుగ్గా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ నాయకుడి కోసమూ సీట్లు రిజర్వ్ చేసేది లేదన్న ఆయన.. పార్టీ కోసం పోరాడిన వాళ్లకే బాధ్యతలిస్తామన్నారు. లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తామని స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంతో తమ సంబంధాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్డీఏలో చేరబోతున్నారా అనే ప్రశ్నకు.. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని బదులిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీఎన్డీఏలో తెలుగుదేశం చేరుతుందంటూ సాగుతున్న ప్రచారంపై సూటిగా స్పందించని చంద్రబాబు.. అలా అంటున్న వాళ్లనే అడగాలని చెప్పారు.


ఇవీ చదవండి:

Last Updated : Sep 1, 2022, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details