వైకాపా రెండేళ్ల పాలనపై తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు చేశారు. మూడు దోపిడీలు, ఆరు కుంభకోణాలుగా జగన్ పాలన సాగిందని ఆరోపించారు. వైకాపా నేతలు పూటకో ఉద్యోగం చేస్తూ.. రెండు తరాలకు సరిపోయేంత డబ్బు కూడబెట్టుకుంటే.. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కలలు పేకమేడల్లా కూలిపోయాయని అన్నారు. ప్రతీకార చర్యలకు జగన్ కేరాఫ్ అడ్రస్‌లా మారారని విమర్శించారు. ఒక్కఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తనకు లభించిన తొలి అవకాశాన్ని.. మలి అవకాశంగా మార్చుకున్నారని దుయ్యబట్టారు.
'మూడు దోపిడీలు, ఆరు కుంభకోణాలుగా వైకాపా రెండేళ్ల పాలన' - వైకాపా రెండేళ్ల పాలనపై బుద్దా వెంకన్న వార్తలు
వైకాపా రెండేళ్ల పాలన మూడు దోపిడీలు, ఆరు కుంభకోణాలుగా ఉందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అధికార పార్టీ నేతలు రెండు తరాలకు సరిపోయేంత డబ్బు కూడబెట్టుకుంటుంటే.. నిరుద్యోగ యువత మాత్రం తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిందన్నారు.
budda venkanna